గోధుమ పిండి హల్వా

ABN , First Publish Date - 2016-01-14T14:45:25+05:30 IST

కావలసినవి: నెయ్యి- అరకప్పు, గోధుమ పిండి- ముప్పావు కప్పు, నీళ్లు- ఒకటిన్నర కప్పు, బెల్లం- ముప్పావు కప్పు, యాలకలపొడి- రెండు టీస్పూన్లు.

గోధుమ పిండి హల్వా

కావలసినవి: నెయ్యి- అరకప్పు, గోధుమ పిండి- ముప్పావు కప్పు, నీళ్లు- ఒకటిన్నర కప్పు, బెల్లం- ముప్పావు కప్పు, యాలకలపొడి- రెండు టీస్పూన్లు.

తయారీ: ఒక గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా నీళ్లుపోసి అది కరిగేవరకు వేడి చేయాలి. మరొక గిన్నెలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండిని పది నిమిషాలపాటు వేగించాలి. అది బంగారు వర్ణంలోకి మారిన తరువాత బెల్లం పాకం అందులో పోసి గడ్డలు కట్టకుండా తిప్పాలి. అది బాగా కలిసిన తరువాత యాలకలపొడి వేసి స్టవ్‌ ఆపేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2016-01-14T14:45:25+05:30 IST