మామిడి పాయసం

ABN , First Publish Date - 2015-09-02T20:39:23+05:30 IST

కావలసినవి: బియ్యం ఒక కప్పులో మూడోవంతు, పాలు అర లీటరు,

మామిడి పాయసం

కావలసినవి: బియ్యం ఒక కప్పులో మూడోవంతు, పాలు అర లీటరు, పాలపొడి అకప్పు, మామిడిరసం అరకప్పు తొక్కతీసిన ఆల్ఫాన్సో పండు ఒకటి, మాంగో ఎసెన్స్‌ నాలుగు చుక్కలు, చక్కెర ఐదు టేబుల్‌ స్పూన్లు, ఆల్మండ్స్‌ ఐదు. పైన అలంకరించడానికి: పిస్తా, ఆల్మండ్‌, జీడిపప్పులు ఒక్కొక్క టేబుల్‌ స్పూన్‌ చొప్పున లేదా ఏ ఒక్కటి అయినా.
తయారుచేసే విధానం
బియ్యాన్ని అరగంటసేపు నీటిలో నానబెట్టాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో పాలు కాగబెట్టాక నీళ్ళు వడకట్టేసిన బియ్యాన్ని దానిలో వేసి సన్నసెగ మీద ఉడికించాలి. అడుగంటకుండా తిప్పుతూ అన్నం మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. అప్పుడు పాలపొడి, చక్కెరవేసి చిక్కబడ్డాక దించి పక్కన పెట్టుకోండి. పిస్తా, ఆల్మండ్స్‌ను ఐదు నిమిషాలు వేడినీటిలో నానబెట్టి తొక్కతీసి సన్నముక్కలుగా కోసుకోండి. జీడిపప్పును నూనెలో వేగించి చిన్న ముక్కలు చేసుకోండి. పాయసంలో మామిడిరసం, మాంగో ఎసెన్స్‌, ఈ పపలు, తొక్కతీసిన మామిడిపండు ముక్కలువేసి బాగా కలిపి వడ్డించండి.

Updated Date - 2015-09-02T20:39:23+05:30 IST