పీతల పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:40:01+05:30 IST

కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పీతలు - 4, ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ

పీతల పులుసు

కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పీతలు - 4, ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి - 2, చింతపండు - గుప్పెడు (రెండు కప్పుల వేడి నీటిలో నానబెట్టి ఉంచాలి), కొత్తిమీర తరుగు - అర కప్పు, నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.
మసాలకోసం: కొబ్బరి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయలు - 4 (పొడుగ్గా కట్‌ చేయాలి), దనియా, జీరా, గరం మసాలా పొడి - 1 టీ స్పూను చొప్పున, అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను (అన్నీ ముద్దలా నూరిపెట్టుకోవాలి)
తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, మసాల ముద్ద, కారం ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. శుభ్రం చేసిన పీతల్ని వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. చింతపండు రసం, ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించి, మంట బాగా తగ్గించి పులుసు చిక్కబడేదాక (కనీసం 30 నిమిషాలు) ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2015-09-02T20:40:01+05:30 IST