పండు కాకర పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:38:42+05:30 IST

కావలసిన పదార్థాలు: కాకరపండ్లు - 3, ఉల్లిముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 5, కరివేపాకు - 4 రెబ్బలు

పండు కాకర పులుసు

కావలసిన పదార్థాలు: కాకరపండ్లు - 3, ఉల్లిముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 5, కరివేపాకు - 4 రెబ్బలు, చింతపండు రసం - 2 కప్పులు, తాలింపు దినుసులు - 1 టీ స్పూను, నూనె - 5 టీ స్పూన్లు, ఎండుమిర్చి -4, బెల్లం - అరకప్పు, కొబ్బరికోరు - అరకప్పు, పసుపు - చిటికెడు, ఉప్పు- రుచికి తగినంత, బియ్యప్పిండి - అరకప్పు.
తయారుచేసే విధానం: కడాయిలో నూనెవేసి ఉల్లిముక్కలు, కాకరముక్కలు (గింజలు లేకుండా), పసుపు, ఉప్పు, మిర్చిముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉడికిన ముక్కల్లో చింతపండు పులుసు, బియ్యప్పిండి (ఉండలు చుట్టకుండా), బెల్లం, కొబ్బరికోరు కలపి మరగనివ్వాలి. మరో పాత్రలో తాలింపు (కరివేపాకు, ఎండుమిర్చితో పాటు) వేగించి, మరిగిన పులుసులో కలుపుకోవాలి. ఇష్టమున్నవారు చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. పులుసు చల్లారనిచ్చి వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-02T20:38:42+05:30 IST