పాలకూర మజ్జిగ పులుసు

ABN , First Publish Date - 2015-09-02T20:36:15+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర తరుగు - రెండు కప్పులు, మజ్జిగ - నాలుగు కప్పులు, బియ్య ప్పిండి

పాలకూర మజ్జిగ పులుసు

కావలసిన పదార్థాలు: పాలకూర తరుగు - రెండు కప్పులు, మజ్జిగ - నాలుగు కప్పులు, బియ్య ప్పిండి - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, తాలింపు కోసం- ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు.
తయారుచేసే విధానం: పాలకూర తరుగులో పసుపు, ఉప్పు వేసి మజ్జిగ కూడా పోసి ఉడికించాలి. దింపేముందు బియ్యప్పిండిని నీళ్ళల్లో కలిపి ఉడుకుతున్న పాలకూరలో వేసి కాసేపు సన్నని మంట మీద ఉడికించి దించేయాలి. చివరిగా తాలింపు పెట్టుకోవాలి.

Updated Date - 2015-09-02T20:36:15+05:30 IST