బీట్‌రూట్‌ గవ్వలు

ABN , First Publish Date - 2015-08-30T22:55:44+05:30 IST

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము - 2 కప్పులు, మైదా - రెండు కప్పులు, కార్న్‌ ఫ్లోర్‌ - 2 కప్పులు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, జీడిపప్పు పొడి - పావు కప్పు,

బీట్‌రూట్‌ గవ్వలు

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము - 2 కప్పులు, మైదా - రెండు కప్పులు, కార్న్‌ ఫ్లోర్‌ - 2 కప్పులు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, జీడిపప్పు పొడి - పావు కప్పు, పంచదార - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, తేనె - 5 టీ స్పూన్లు, (వేడి) నెయ్యి - 3 టీ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఏలకుల పొడి - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: బీట్‌రూట్‌లో కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్‌చేసి రసం తీసి, ఈ రసాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్‌, కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి, తేనె, నెయ్యి వేసి తగినంత బీట్‌రూట్‌ రసంతో ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టి తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండల్ని (గవ్వల పీటపై) గవ్వల్లా చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. మరో పాత్రలో బెల్లం, పంచదార మిగిలిన బీట్‌రూట్‌ రసం, ఏలకుల పొడి వేసి పాకం తీసి, వేగిన గవ్వలు వేయాలి. గవ్వలకు పాకం బాగా పట్టాక తీసి ఆరబెట్టుకోవాలి. గవ్వలు ఎర్రగా ఉండి చూడ్డానికి అందంగా కనిపిస్తాయి

Updated Date - 2015-08-30T22:55:44+05:30 IST