సేమ్యా బర్ఫీ

ABN , First Publish Date - 2015-09-03T17:21:07+05:30 IST

కావలసిన పదార్థాలు : సేమియా - ఒక కప్పు కోరిన పచ్చికొబ్బరి - ఒక కప్పు,

సేమ్యా బర్ఫీ

కావలసిన పదార్థాలు : సేమియా - ఒక కప్పు కోరిన పచ్చికొబ్బరి - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, యాలకుల పొడి - ఒక టీ స్పూను, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం
కడాయిలో నెయ్యిని వేడిచేసుకుని సేమియాను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించి పంచదార, యాలకుల పొడితో పాటు అరకప్పు నీటిని వేసి అడుగంటకుండా తిపతుండాలి. పాకం చిక్కనయ్యాక కొబ్బరి తురుముని వేసి మళ్లీ తిప్పాలి. సేమియా గట్టి పడ్డాక నెయ్యిరాసిన పళ్లెంలో వేసి మనకు నచ్చిన ఆకారాల్లో కోసుకుని చల్లారాక విడదీసి పెట్టుకోవాలి. ఇవి కొన్నాళ ్లపాటు నిలవుంటాయి.

Updated Date - 2015-09-03T17:21:07+05:30 IST