సజ్జ గారెలు

ABN , First Publish Date - 2015-09-03T00:20:30+05:30 IST

కావలసిన పదార్థాలు: సజ్జపిండి - 2 కప్పులు, బెల్లం తురుము - 1 కప్పు, నీరు - 1 కప్పు,

సజ్జ గారెలు

కావలసిన పదార్థాలు: సజ్జపిండి - 2 కప్పులు, బెల్లం తురుము - 1 కప్పు, నీరు - 1 కప్పు, యాలకులపొడి - అర టీ స్పూను, పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్‌ స్పూన్లు, గసగసాలు - 2 టీ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బెల్లాన్ని నీటిలో కరిగించి, అందులో యాలకులపొడి వేసి సన్నని మంటపైన లేతపాకం వచ్చాక దించేయాలి. ఒక పళ్లెంలో సజ్జపిండి, కొబ్బరి తురుము తీసుకొని అందులో కొద్దికొద్దిగా బెల్లం పాకం పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పిండిని నిమ్మకాయంత ఉండలుగా తీసుకుని, చేత్తో గారెల్లా వత్తుతూ, గసగసాలను రెండు వైపులా పలచగా అద్ది, నూనెలో దోరగా వేగించుకోవాలి.

Updated Date - 2015-09-03T00:20:30+05:30 IST