సేమియా హల్వా

ABN , First Publish Date - 2015-09-03T00:27:50+05:30 IST

కావలసిన పదార్థాలు: సేమియా - 1 కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - పావు కప్పు, పాలు - 2 కప్పులు,

సేమియా హల్వా

కావలసిన పదార్థాలు: సేమియా - 1 కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - పావు కప్పు, పాలు - 2 కప్పులు, యాలకుల పొడి - పావు టీ స్పూను, కుంకుమపువ్వు పొడి - చిటికెడు, నెయ్యి లేదా కరిగించిన బటర్‌ - పావు కప్పు, పంచదార లేత పాకం - అరకప్పు, ఉప్పు - చిటికెడు.
తయారుచేసే విధానం: సేమియా నేతిలో వేగించి పక్కనుంచాలి. ఒక వెడల్పాటి కడాయిలో కొద్దిగా నెయ్యి, పంచదార పాకం, యాలకులు, కుంకుమపువ్వు పొడి, వేగించిన సేమియా, పాలు, ఉప్పు కలిపి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. పాలన్నీ ఆవిరయ్యాక కండెన్స్‌డ్‌ మిల్క్‌ , మిగతా నెయ్యి కలపాలి. తీగపాకం రాగానే ఒక వెడల్పాటి ప్లేట్‌లో పోసి, చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవాలి. పిల్లలు బాగా ఇష్టపడే హల్వా ఇది.

Updated Date - 2015-09-03T00:27:50+05:30 IST