ఇన్‌స్టంట్‌ లెమన్‌ పికిల్‌

ABN , First Publish Date - 2017-05-27T17:35:28+05:30 IST

కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు-7 (300గ్రాములు), ని

ఇన్‌స్టంట్‌ లెమన్‌ పికిల్‌

కావాల్సిన పదార్థాలు
నిమ్మకాయలు-7 (300గ్రాములు), నిమ్మరసం- 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- 3 టీస్పూన్లు, పసుపు-1/4 టీస్పూను, పంచదార(సన్నటిది)-1 1/2కప్పు, కారం-2 టీస్పూన్లు.
 
 
తయారీవిధానం
 
ప్రెషర్‌ కుక్కర్‌లో నాలుగు కప్పుల నీళ్లుపోసి నిమ్మకాయలు ఉడికించాలి. ఐదు విజిల్స్‌ రాగానే స్టవ్‌ ఆపేయాలి.
ఉడికిన నిమ్మకాయలను వేడి నీళ్లలోనుంచి తీసి చల్లారనివ్వాలి.
నిమ్మకాయలు చల్లారాక వాటిని పెద్దగిన్నెలో పెట్టి నాలుగు ముక్కలుగా తరగాలి. ఇలా చేస్తే వాటిలోని జ్యూసు వృధాకాదు. తర్వాత నిమ్మకాయముక్కల్లో విడిగా ఉన్న నిమ్మరసం కలపాలి.
గిన్నెలోని నిమ్మముక్కల్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు అలాగే ఉంచాలి.
తర్వాత రెండు లేదా మూడు టేబుల్‌స్పూన్ల సన్నటి పంచదారను పోస్తూ ముక్కల్ని కలపాలి. ఇలా చేస్తే పంచదార తొందరగా నిమ్మకాయ రసంలో కలిసిపోతుంది.
తర్వాత అందులో కారం వేసి కలపాలి.
ఈ పికిల్‌ని గాజు సీసాలో పెట్టి మరుసటి రోజునుంచి తినొచ్చు.
నూనే లేని ఈ పికిల్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.
 
పోషకవిలువలు
ఎనర్జీ-584 కిలోకేలరీలు
ప్రొటీన్‌- 1.2 గ్రాములు
కార్బోహైడ్రేట్లు-141.5 గ్రాములు
విటమిన్‌ సి-46.8 మిల్లీగ్రాములు
ఫైబర్‌- 2.0 గ్రాములు
ఫ్యాట్‌- 1.1 గ్రాములు

Updated Date - 2017-05-27T17:35:28+05:30 IST