పెసరకోవా హల్వా

ABN , First Publish Date - 2015-09-02T22:56:53+05:30 IST

కావల్సినవి: పెసరపప ఒక కప్పు, పాలు ఒక కప్పు, చక్కెర ఒకటింపావు కప్పు, యాలకులపొడి అరటీస్పూను,

పెసరకోవా హల్వా

కావల్సినవి: పెసరపప ఒక కప్పు, పాలు ఒక కప్పు, చక్కెర ఒకటింపావు కప్పు, యాలకులపొడి అరటీస్పూను, పచ్చికోవా అరకప్పు కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి ఆరు టేబుల్‌స్పూన్లు, ఆల్మండ్లు పిస్తా పప్పులు రెండు టేబుల్‌ స్పూన్లు (చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
తయారుచేసే విధానం:
పెసరపప్పును మూడుగంటలసేపు నానబెట్టాక నీళ్లు వడగట్టి. మరీ మెత్తగా కాకుండా రుబ్బి పెట్టుకోండి. నీళ్లు బాగా తక్కువ వాడాలి. ఒక టేబుల్‌ స్పూను గోరువెచ్చటి పాలలో కుంకుమ పువ్వు కరగపెట్టి పక్కన ఉంచుకోండి.
వెడల్పాటి నాన్‌స్టిక్‌ పాన్‌లో నెయ్యి వేసి కరిగాక పెసరపిండి వేసి సన్నసెగ మీద ఆపకుండా తిప్పుతూ ఉండండి. బంగారు రంగు వచ్చాక పచ్చికోవా వేసి మరికాసేపు తిప్పండి. మిగిలిన పాలు, ఒక కప్పు నీళ్లు (రెండూ గోరువెచ్చగా ఉండాలి) పోసి అవన్నీ ఆవిరయ్యేదాకా తిప్పుతూనే ఉండండి. ఇప్పుడు కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి మరోసారి కలిపి ఆల్మండ్‌, పిస్తా పప్పుల ముక్కలతో అలంకరించి వడ్డించండి.

Updated Date - 2015-09-02T22:56:53+05:30 IST