సేమ్యా కట్‌లెట్‌

ABN , First Publish Date - 2016-08-27T18:47:36+05:30 IST

సేమ్యా - 200 గ్రా, బియ్యప్పిండి - అరకప్పు, బంగాళదుంప - 200 గ్రా, క్యారెట్‌ తురుము - 50 గ్రా, ఉల్లి తరుగు - 50 గ్రా, గరం మసాలా - టీ స్పూను, కొత్తిమీర - కట్ట, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత

సేమ్యా కట్‌లెట్‌

కావలసిన పదార్ధాలు: సేమ్యా - 200 గ్రా, బియ్యప్పిండి - అరకప్పు, బంగాళదుంప - 200 గ్రా, క్యారెట్‌ తురుము - 50 గ్రా, ఉల్లి తరుగు - 50 గ్రా, గరం మసాలా - టీ స్పూను, కొత్తిమీర - కట్ట, కారం - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత

 
తయారీ విధానం: ముందుగా బంగాళదుంపను ఉడికించి తొక్కతీసి మెత్తగా గుజ్జు చేసి ఉంచుకోవాలి. బాణలిలో తగినంత నీరుపోసి అందులో సేమ్యా, క్యారెట్‌ తురుము వేసి ఉడికించి ఉంచాలి. ఒక గిన్నెలోకి ఉడికించుకున్న ఈ పదార్ధాలను, ఉప్పు, కారం, ఉల్లితరుగు, బియ్యప్పిండి, గరంమసాలా, కొత్తిమీర కలిపి ముద్దగా చేయాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా తీసుకుని నచ్చిన ఆకారంలో కట్‌లెట్లను తయారు చేసుకోవాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసుకుంటూ కట్‌లెట్లను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. సేమ్యా కట్‌లెట్‌ టొమాటో సాస్‌తో సర్వ్‌ చేస్తే బావుంటుంది.

Updated Date - 2016-08-27T18:47:36+05:30 IST