రవ్వలడ్డు

ABN , First Publish Date - 2015-12-08T16:10:32+05:30 IST

కావాల్సిన పదార్థాలు: జొన్నరవ్వ - 250 గ్రాములు, ఎండుద్రాక్ష - 25గ్రాములు, జీడిపప్పు - 25గ్రాములు, కొబ్బరిపొడి - 125గ్రాములు, పంచదారపొడి - 250గ్రాములు, యాలకులు -

రవ్వలడ్డు

కావాల్సిన పదార్థాలు: జొన్నరవ్వ - 250 గ్రాములు, ఎండుద్రాక్ష - 25గ్రాములు, జీడిపప్పు - 25గ్రాములు, కొబ్బరిపొడి - 125గ్రాములు, పంచదారపొడి - 250గ్రాములు, యాలకులు - 5, నెయ్యి - 200గ్రాములు, పాలు - 100మి.లీ
తయారుచేయు విధానం: జొన్న రవ్వని ముందు జల్లించుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి రవ్వని ముందుగా వేయించుకోవాలి. ఇందులో డాల్డా లేదా నెయ్యి వేసి కలుపుకోవాలి. స్టౌ మీద మరో గిన్నె పెట్టి కొద్ది నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరిపొడి వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని వేయించిన జొన్న రవ్వలో కలుపుకోవాలి. ఇప్పుడు పాలని, డాల్డాని వేరువేరుగా వేడి చేసి రవ్వలో పోసి నిదానంగా కలుపుకోవాలి. వేడి చల్లారకుండా దీన్ని లడ్డూలుగా చుట్టుకోవాలి. చివరల్లో ఎండుద్రాక్షతో అలంకరించుకోవాలి.

Updated Date - 2015-12-08T16:10:32+05:30 IST