డేట్‌ బేక్‌

ABN , First Publish Date - 2018-06-09T21:47:22+05:30 IST

కండెన్స్డ్‌ పాలు-400 గ్రాములు, ఎండుఖర్జూరాలు- ఒకటిన్నర కప్పు (సన్నటిముక్కలుగా చేసి), నీళ్లు-250ఎంఎల్‌...

డేట్‌ బేక్‌

కావలసిన పదార్థాలు
 
కండెన్స్డ్‌ పాలు-400 గ్రాములు, ఎండుఖర్జూరాలు- ఒకటిన్నర కప్పు (సన్నటిముక్కలుగా చేసి), నీళ్లు-250ఎంఎల్‌, వంటసోడా- పావు టీస్పూను, వెన్న-100 గ్రాములు (తురుము), చక్కెర పొడి- 70 గ్రాములు, గుడ్లు-రెండు, తక్కువ ప్రొటీన్‌ ఉన్న కేక్‌ పౌడర్‌ (వైట్‌ సెల్ఫ్‌-రైజింగ్‌ ఫ్లోర్‌)-175 గ్రాములు, వెనీలా పౌడర్‌- రెండు టీస్పూన్లు.
 
తయారీవిధానం
సాస్‌పాన్‌లో చిక్కటిపాలు, ఎండుఖర్జూరం ముక్కలు, నీళ్లు పోసి స్టవ్‌ మీద చిన్న మంటపై మూడు నిమిషాలు మరిగించాలి. తర్వాత కిందికి దించేసి వంటసోడా కలపాలి.
ఈ మిశ్రమం నురగలా ఉంటుంది. కాసేపు చల్లారనివ్వాలి. ఇంకో గిన్నె తీసుకుని అందులో వెన్న, పంచదార వేసి మెత్తగా అయ్యేవరకూ బాగా కలపాలి. గుడ్లను కూడా ఒక్కొక్కదానిని పగలగొట్టి అందులో కలపాలి. ఆ మిశ్రమాన్ని పిండి, వెనీలా పౌడర్‌లలో పేస్టులా అయ్యేవరకూ కలపాలి. దాన్ని ఖర్జూరం మిశ్రమంలో వేసి కలపాలి.
వెన్న, ఫ్లోర్‌ పొర ఉన్న బేకింగ్‌ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి 175 సెంటీగ్రేడ్‌ ప్రిహీట్‌ ఒవెన్‌లో ముప్పావు గంట ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి తింటే వారెవ్వా అనాల్సిందే.

Updated Date - 2018-06-09T21:47:22+05:30 IST