కోవా కజ్జికాయలు

ABN , First Publish Date - 2015-12-08T16:18:15+05:30 IST

కావాల్సిన పదార్థాలు: మైదాపిండి - 500గ్రాములు, పంచదార - ఒక కిలో, కావా - 250గ్రాములు, జాపత్రి -రెండు గ్రాములు, యాలకులు - ఐదు, శెనగపిండి - 50గ్రాములు,

కోవా కజ్జికాయలు

కావాల్సిన పదార్థాలు: మైదాపిండి - 500గ్రాములు, పంచదార - ఒక కిలో, కావా - 250గ్రాములు, జాపత్రి -రెండు గ్రాములు, యాలకులు - ఐదు, శెనగపిండి - 50గ్రాములు, వంట సోడా - పావు టీ స్పూను, బేకింగ్‌ పౌడర్‌ - పావు టీ స్పూను, నెయ్యి - 120గ్రాములు, నూనె - అరకిలో.
తయారుచేయు విధానం: ముందుగా స్టౌవ్‌ మీద గిన్నె పెట్టి కోవా, శెనగపిండి వేసి దోరగా వేయించుకోవాలి. అందులో జాపత్రిపొడి, యాలకులపొడి, పంచదారం కలిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. మైదాపిండిలో వంటసోడా, బేకింగ్‌ పౌడర్‌, నెయి, కొద్దిగా నీళ్లు కలిపి గట్టి ముద్దలా చేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయంత పిండి ముద్దలను తీసుకుని చిన్న పూరీల్లా కొంచెం మందంగా వత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి కజ్జికాయల్లా మడుచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చక్కర పోసి రెండు గ్లాసుల నీళ్లు పోసి లేత తీగపాకం రానిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయల్ని నూనెలో వేయించి గోధుమ రంగు రాగానే తీసి గోరు వెచ్చని చక్కెరపాకంలో వేసి ముంచి తీయాలి. అంతే కోవా పూరీలు రెడీ.

Updated Date - 2015-12-08T16:18:15+05:30 IST