ఖర్జూర రోల్స్‌

ABN , First Publish Date - 2015-09-02T18:35:17+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చి ఖర్జూర పండ్లు - 10, కోవా (గట్టిది) - 1 కప్పు,

ఖర్జూర రోల్స్‌

కావలసిన పదార్థాలు: పచ్చి ఖర్జూర పండ్లు - 10, కోవా (గట్టిది) - 1 కప్పు, జీడిపప్పు - 10, చెర్రీలు/బాదం - 10, ఎండుకొబ్బరి కోరు - అరకప్పు.
తయారుచేసే విధానం: ఒక్కో ఖర్జూర పండుపై కత్తితో ఒక పక్క నిలువుగా కోసి గింజ తీసేసి అందులో జీడిపప్పు పెట్టి మళ్లీ మూసేయాలి. ఈ పండును కోవాతో మూసేసి ఎండుకొబ్బరి కోరులో దొర్లించి పైన చెర్రీని గుచ్చి అలంకరించాలి. పొయ్యి మీద పెట్టకుండానే స్నాక్‌ రెడీ. సాయంత్రం పిల్లలు స్కూలునుండి రాగానే ఈ ఖర్జూర రోల్స్‌ ఇవ్వండి. శ్రమ తక్కువ - ప్రోటిన్స్‌ ఎక్కువ.

Updated Date - 2015-09-02T18:35:17+05:30 IST