స్వీట్‌ మ్యాంగో పికిల్‌

ABN , First Publish Date - 2017-03-18T20:48:26+05:30 IST

కావాల్సిన పదార్థాలు మామిడి కోరు - 2 కప్పులు, పంచదార - 1 3/4 కప్పు, కారం - 1 టీస్పూను, జీలకర్ర

స్వీట్‌ మ్యాంగో పికిల్‌

కావాల్సిన పదార్థాలు
మామిడి కోరు - 2 కప్పులు, పంచదార - 1 3/4 కప్పు, కారం - 1 టీస్పూను, జీలకర్ర పొడి - అర టీస్పూను, ఉప్పు - 1 టీస్పూను, పసుపు - పావు టీస్పూను.
 
తయారీ విధానం
మామిడి కోరు, ఉప్పు, పసుపు, పంచదార అన్నీ కలిపి చిన్న మంట మీద చక్కెర కరిగేవరకూ ఉడికించాలి.
మిశ్రమం బుడగలు వచ్చేవరకూ ఉడికిస్తూ ఒక తీగ పాకానికి చేరుకునే
వరకూ అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి.
మంట తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
చివర్లో కారం, జీలకర్ర పొడి కలిపి గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి.
ఈ పికిల్‌ రోటీలు, బ్రెడ్‌లోకి బాగుంటుంది.

Updated Date - 2017-03-18T20:48:26+05:30 IST