మామిడికాయ ముక్కల పచ్చడి

ABN , First Publish Date - 2017-03-18T20:46:25+05:30 IST

కావాల్సిన పదార్థాలు మామిడి కాయలు - 3 (చిన్న ముక్కలుగా తరుక్కోవాలి), కారం - 2 కప్పులు, ఆవాలు - 1 కప్పు (నూనె లేకుండా వేయించుకోవాలి), మెంతి పొడి - ముప్పాతిక స్పూను,

మామిడికాయ ముక్కల పచ్చడి

కావాల్సిన పదార్థాలు
మామిడి కాయలు - 3 (చిన్న ముక్కలుగా తరుక్కోవాలి), కారం - 2 కప్పులు, ఆవాలు - 1 కప్పు (నూనె లేకుండా వేయించుకోవాలి), మెంతి పొడి - ముప్పాతిక స్పూను, ఉప్పు - ముప్పాతిక కప్పు, వెల్లుల్లి - 10 రెబ్బలు, నువ్వుల నూనె - 1 కప్పు
 
తయారీ విధానం
మామిడి కాయలు శుభ్రంగా తుడిచి, చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
మెంతులు వేయించి పొడి చేసుకోవాలి.
బాండీలో నూనె పోసి వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి.
వెడల్పాటి గిన్నెలో కారం, మెంతి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
తర్వాత మామిడి ముక్కలు కూడా వేసి మసాలాలు పట్టేలా బాగా కలపాలి.
తర్వాత చల్లారిన నూనె, వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి మూత పెట్టి ఒక రోజంతా కదల్చకుండా ఉంచాలి.
మరుసటి రోజు గరిటతో తిప్పి మళ్లీ మూత పెట్టేయాలి.
మూడో రోజునుంచి పచ్చడి తినటానికి సిద్ధమవుతుంది.

Updated Date - 2017-03-18T20:46:25+05:30 IST