స్వీట్‌ కార్న్‌ పాయసం

ABN , First Publish Date - 2016-07-09T16:10:07+05:30 IST

కావలసిన పదార్థాలు: కార్న్‌ - 1, పాలు - 2 టే.స్పూన్లు, పాలు - 2 కప్పులు. యాలకుల పొడి - అర టీస్పూను, నెయ్యి - అర టే.స్పూను, పంచదార - 4 టే.స్పూన్లు, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు - 1 టే.స్పూను, కుంకుమ పువ్వు - చిటికెడు.

తయారీ విధానం:
మిక్సీలో కార్న్‌ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి ఈ ముద్దను అందులో వేసి నాలుగు నిమిషాలపాటు చిన్న మంట మీద వే యించాలి. తర్వాత అందులో పాలు పోసి కలపాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచుకోవాలి. పాయసాన్ని చిన్న మంట మీద ఉంచి 8 నిమిషాలపాటు అడుగంటకుండా ఉడికించాలి. దీంట్లో చక్కెర కలపాలి. పాయసం చిక్కబడేవరకూ ఉడికించి యాలకుల పొడి వేయాలి. చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-07-09T16:10:07+05:30 IST