Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మునగాకు సాంబార్‌

మునగాకు సాంబార్‌

v>
సూపర్‌ డూపర్‌ మునగాకు 
మునగాకుల్లో కమలా పండ్లలో కంటే విటమిన్‌-సి ఏడు రెట్లు, క్యారెట్లలో కంటే విటమిన్‌-ఎ నాలుగు రెట్లు, పాలలో కంటే క్యాల్షియం నాలుగు రెట్లు, అరటిపండ్లలో కంటే పొటాషియం మూడు రెట్లు, పెరుగులో కంటే ప్రొటీన్‌ రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో రక్తహీనతకు మునగాకు మంచి మందు. మన దగ్గర మునగాకుల్ని అంతగా పట్టించుకోరు. కాని ఆఫ్రికాలో పోషకాహారలోపంతో బాధపడే పిల్లలకు ఈ ఆకుల పొడిని ఇస్తుంటారు. ఈ పొడి తీసుకున్న పిల్లలు బరువు పెరుగుతారు. మొత్తంగా ఆరోగ్యం బాగుంటుంది. గర్భిణులు దీన్ని సేవించడం వల్ల పిల్లలు మంచి బరువుతో పుడతారు. రక్తహీనత బారినపడకుండా ఉంటారు. ఈ మధ్య మన దగ్గర కూడా ఈ ఆకులతో తయారుచేసిన కుకీలు, హెర్బల్‌ టీ ప్రాచుర్యం పొందుతున్నాయి. మనగాకుల్ని మెంతి, పాలకూరలకు బదులుగా వాడతారు. అంతేకాదు యువతరం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా, ఆమ్లెట్లలో మునగాకుల్ని వాడుతున్నారు.
 
 
మునగాకు సాంబార్‌
 
కావలసిన పదార్థాలు
మునగాకులు - గుప్పెడు, చింతపండు - నిమ్మకాయంత సైజ్‌, కందిపప్పు (ఉడికించి) - ఒక కప్పు, ఇంగువ - చిటికెడు, సాంబార్‌ పొడి - ఒక టీ స్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, బియ్యప్పిండి - ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక టీ స్పూన్‌, ఆవాలు - తాలింపునకు, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకులు - కొన్ని.
 
తయారీవిధానం:
చింతపండు రసం పిండి పసుపు, ఇంగువ, సాంబార్‌ పొడి, ఉప్పు వేసి చింతపండు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. తరువాత మునగాకులు వేసి మరికొద్దిసేపు ఉడికించాలి. ఉడికించిన కందిపప్పును మెత్తగాచేసి రసం నీళ్లలో కలపాలి. తరువాత బియ్యప్పిండి కలిపితే రసం చిక్కబడుతుంది. ఈ మిశ్రమం ఉడుకుపట్టాక, స్టవ్‌ మంట ఆపేయాలి. నూనె వేడిచేసి, ఆవాలు వేసి అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు వేసి, సాంబార్‌లో తాలింపు వేయాలి. ఈ సాంబార్‌ను అన్నంలో కలుపుకుని తింటే యమ్మీగా ఉంటుంది

విద్యార్థులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలివిద్యార్థులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేయాలిమంత్రి అల్లోలపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌మంత్రి అల్లోలపై అర్థం లేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్‌ఖానాపూర్‌లో దొంగల కలకలంఖానాపూర్‌లో దొంగల కలకలంఅర్ధరాత్రి దాటాక హంగామాఅర్ధరాత్రి దాటాక హంగామాసింగరేణి సూపర్‌ బజార్లలో రూ. 40 లక్షల స్వాహాసింగరేణి సూపర్‌ బజార్లలో రూ. 40 లక్షల స్వాహాసంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధిసంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధిధరలు తగ్గించాలని నిరసనధరలు తగ్గించాలని నిరసనకేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలికేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలినెత్తురోడుతున్న రహదారులునెత్తురోడుతున్న రహదారులుఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు బంధుపై సందిగ్ధతఆసిఫాబాద్‌ జిల్లాలో రైతు బంధుపై సందిగ్ధత
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.