రవ్వ కేక్

ABN , First Publish Date - 2016-05-30T15:13:36+05:30 IST

కావలసిన పదార్థాలు: వేగించిన బొంబాయి రవ్వ- 1 కప్పు, జీడిపప్పు పొడి, పాలు, నీళ్ళు- ఒక్కోటి 1/2 కప్పు చొప్పున, బేకింగ్‌ పౌడర్‌- 1/4 టీ స్పూను, కరిగించిన వెన్న- 1/4 కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార- ఒక్కోటి

రవ్వ కేక్

కావలసిన పదార్థాలు: వేగించిన బొంబాయి రవ్వ- 1 కప్పు, జీడిపప్పు పొడి, పాలు, నీళ్ళు- ఒక్కోటి 1/2 కప్పు చొప్పున, బేకింగ్‌ పౌడర్‌- 1/4 టీ స్పూను, కరిగించిన వెన్న- 1/4 కప్పు, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార- ఒక్కోటి 3/4 కప్పు చొప్పున, కార్న్‌ఫ్లోర్‌- 1/2 టీ స్పూను, నిమ్మరసం- 1 టేబుల్‌ స్పూను, రోజ్‌ వాటర్‌- 1 టీ స్పూను, జీడిపప్పులు- 10.
 
తయారీ విధానం: ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, జీడిపప్పు పొడి, బేకింగ్‌ పౌడర్‌, పాలు, వెన్న, కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి బాగా కలిపి దానిని కేక్‌ కుక్కర్‌లో అరగంట (ఓవెన్‌లో అయితే పావుగంట ) ఉడికించాలి. తరువాత బయటకు తీసి ముక్కలు కోసి జీడి పప్పులు అతికించి తిరిగి మరో అరగంట చిన్న మంటపై (ఓవెన్‌లో అయితే పావుగంట) ఉడికించి తీయాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార, కార్న్‌ఫ్లోర్‌, నీళ్ళు పోసి పంచదార కరిగేవరకూ మరిగించాక మంట తగ్గించి నిమ్మరసం, రోజ్‌ వాటర్‌ వేసి మంట కట్టేయాలి. ఈ పాకాన్ని రవ్వ కేక్‌ ముక్కలపై పోసి అవి పాకాన్ని పీల్చుకున్నాక తినాలి.

Updated Date - 2016-05-30T15:13:36+05:30 IST