మామిడి పేడా

ABN , First Publish Date - 2016-05-02T20:54:02+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార పొడి- 1/2 కప్పు, నెయ్యి- 3 టీ స్పూన్లు, పచ్చికోవా- 1 కప్పు, కండెన్సడ్‌ మిల్క్‌- 1 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం, పిస్తా తురుము- 1 టేబుల్‌ స్పూను

మామిడి పేడా

కావలసిన పదార్థాలు: మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార పొడి- 1/2 కప్పు, నెయ్యి- 3 టీ స్పూన్లు, పచ్చికోవా- 1 కప్పు, కండెన్సడ్‌ మిల్క్‌- 1 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం, పిస్తా తురుము- 1 టేబుల్‌ స్పూను.
 
తయారీ విధానం: ఒక నానస్టిక్‌ పానలో టీ స్పూను నెయ్యి వేసి వేడిచేయాలి. తరువాత కోవా, కండెన్సడ్‌ మిల్క్‌ పోసి సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక మంట కట్టేయాలి. తరువాత మరో నానస్టిక్‌ పాన తీసుకుని టీ స్పూను నెయ్యి వేసి వేడిచేయాలి. ఆ తరువాత మామిడి గుజ్జు, పంచదార, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక కోవా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తరువాత పదార్థాన్ని బాగా మెదపాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న బిళ్ళలు చేసి మధ్యలో వేలితో ఒత్తి బాదం, పిస్తా తరుముతో అలంకరించాలి.

Updated Date - 2016-05-02T20:54:02+05:30 IST