రేగి పచ్చడి

ABN , First Publish Date - 2016-12-19T20:30:13+05:30 IST

రేగిపండ్లు- పావు కిలో, పచ్చిమిర్చి- పది, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు- పావు టీ

రేగి పచ్చడి

కావలసిన పదార్థాలు

రేగిపండ్లు- పావు కిలో, పచ్చిమిర్చి- పది, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, నువ్వులు- పావు టీ స్పూను, ఎండుమిర్చి- 2, మినప్పప్పు- ఒక టీ స్పూను, కరివేపాకు- కొద్దిగా, తరిగిన కొత్తిమీర- 2 టీ స్పూన్లు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
ముందుగా రేగిపండ్లలో విత్తనాలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేసిన తర్వాత రేగిపండ్లు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక నువ్వులు, ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసి పోపు పెట్టుకుని దాన్ని రేగిపండ్ల పచ్చడిలో కలపాలి.

Updated Date - 2016-12-19T20:30:13+05:30 IST