క్యాబేజీ పరోటా

ABN , First Publish Date - 2016-10-19T19:56:05+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము- రెండు కప్పులు, గోధుమ పిండి- రెండు కప్పులు, గరం మసాలా- అర టీ స్పూను,

క్యాబేజీ పరోటా

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము- రెండు కప్పులు, గోధుమ పిండి- రెండు కప్పులు, గరం మసాలా- అర టీ స్పూను, తరిగిన కొత్తిమీర- ఒక కట్ట, పసుపు- చిటికెడు, కారం- ఒక టీ స్పూను, నూనె- రెండు టీ స్పూన్లు, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని.
తయారీ విధానం: క్యాబేజీ తురుములో కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టి. ఉడికాక నీరు మొత్తం పిండేయాలి. తర్వాత నూనె, నెయ్యి మినహా మిగిలిన పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. చివర్లో నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పరోటాలు చేసుకొని పెనం మీద నెయ్యితో కాల్చుకోవాలి.

Updated Date - 2016-10-19T19:56:05+05:30 IST