బ్రొకోలి సూప్‌

ABN , First Publish Date - 2017-06-17T19:07:01+05:30 IST

కావలసిన పదార్థాలు బ్రొకోలి - 250 గ్రా., వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ - 1,

బ్రొకోలి సూప్‌

కావలసిన పదార్థాలు
 
బ్రొకోలి - 250 గ్రా., వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ - 1, వెల్లుల్లి రెబ్బలు - 3, వెజిటబుల్‌ స్టాక్‌ - రెండున్నర కప్పులు, పాలు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీ స్పూను, క్రీమ్‌ - అరకప్పు.
 
తయారుచేసే విధానం
 
కుక్కర్‌లో నూనె, బటర్‌ వేసి బ్రొకోలి, ఉల్లి, వెల్లుల్లి ముక్కలను రెండు నిమిషాలు వేగించి వెజిటబుల్‌ స్టాక్‌ పోసి మూతపెట్టి రెండు విజిల్స్‌ రానివ్వాలి. చల్లారిన తర్వాత వడకట్టి ముక్కలను మిక్సీలో రుబ్బాలి. ఒక పెద్ద పాత్రలో రుబ్బిన మిశ్రమంతో పాటు పాలు, ఉప్పు, మిరియాల పొడి, వడకట్టిన నీరు కలిపి మరిగించాలి. పది నిమిషాల తర్వాత దించేసి క్రీమ్‌ చల్లాలి. ఈ సూప్‌ని వేడివేడిగా వర్షాకాలం సాయంత్రం తాగితే ఆ రుచే వేరు!

Updated Date - 2017-06-17T19:07:01+05:30 IST