మెంతి ఆవకాయ

ABN , First Publish Date - 2017-05-06T16:24:53+05:30 IST

మెంతిపొడి-150 గ్రాములు, ఎండుకారం- 150 గ్రాములు, ఉప్పు- 150 గ్రాములు, పల్లీనూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ-1 టీస్పూను. పచ్చడి తయారు చేయడానికి: పల్లీనూనె- 300 గ్రాములు, మామిడికాయలు-10.

మెంతి ఆవకాయ

కావాల్సిన పదార్థాలు:
 
మసాలా కోసం: మెంతిపొడి-150 గ్రాములు, ఎండుకారం- 150 గ్రాములు, ఉప్పు- 150 గ్రాములు, పల్లీనూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ-1 టీస్పూను.
పచ్చడి తయారు చేయడానికి: పల్లీనూనె- 300 గ్రాములు, మామిడికాయలు-10.
 
తయారీ: పొడిగా ఉన్న గిన్నె తీసుకుని అందులో మెంతిపొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేడిచేసి ఇంగువ వేయాలి. అది చల్లారిన తర్వాత కలిపిపెట్టుకున్న కారం, ఉప్పు, మెంతి పొడిల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మామిడికాయల్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి కాసేపు ఆరబెట్టాలి. ఆ తర్వాత మామిడికాయ పైభాగాన కోసి లోపలి టెంకె తీసేయాలి. తరువాత గుత్తి వంకాయకు మల్లే మామిడికాయ విడిపోకుండా కోయాలి. ఈ మామిడికాయల్లో కలుపుకున్న మిశ్రమాన్ని బాగా కూరాలి. తరువాత మామిడికాయలను గాజు సీసాలో ఒక్కొక్కటి జాగ్రత్తగా పెట్టి గాలిచొరబడకుండా మూతపెట్టాలి. ఒకరోజంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఊరగాయలో నూనెపోసి కలపాలి. మరో 24 గంటల తరువాత నూనె వేడి చేసి చలార్చి మామిడికాయలన్నీ మునిగేలా నూనె పోయాలి. ఈ పచ్చడిని కిచిడితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2017-05-06T16:24:53+05:30 IST