వెజిటబుల్‌ హాట్‌ అండ్‌ సోర్‌ సూప్‌

ABN , First Publish Date - 2017-07-22T23:09:12+05:30 IST

కావలసిన పదార్థాలు క్యారెట్‌ తురుము - 50 గ్రా, బటన్‌ మష్రూమ్స్‌ - 6 (పలచగా తరగాలి)

వెజిటబుల్‌ హాట్‌ అండ్‌ సోర్‌ సూప్‌

కావలసిన పదార్థాలు
 
క్యారెట్‌ తురుము - 50 గ్రా, బటన్‌ మష్రూమ్స్‌ - 6 (పలచగా తరగాలి)
సన్నగా తరిగిన ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావు కప్పు, క్యాబేజీ తరుగు - అర కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు, వెల్లుల్లి, అల్లం తరుగు - 1 టీ స్పూను
మిరియాల పొడి - చిటికెడు, చిల్లీ, గ్రీన్‌ చిల్లీ సాస్‌ - 3/4 టీస్పూన్లు
నీరు లేదా వెజ్‌ స్టాక్‌ - రెండున్నర కప్పులు, కొత్తిమీర - 2 కట్టలు
3 టేబుల్‌సూన్ల కార్న్‌ స్టార్చ్‌ + పావు కప్పు నీళ్లు
నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - తగినంత
 
తయారీ విధానం
 
పాన్‌లో నూనె వేడిచేసి, ఉల్లి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.
తర్వాత మష్రూమ్స్‌, బీన్స్‌ కూడా వేసి వేయించాలి.
మష్రూమ్స్‌ అంచులు గోధుమ రంగులోకి మారేవరకూ వేయించాలి.
ఈలోగా కార్న్‌ స్టార్చ్‌ తయారు చేసుకుని పక్కనుంచుకోవాలి.
మష్రూమ్స్‌ రంగు మారిన తర్వాత క్యారెట్‌, క్యాబేజీ తరుగులు వేసి కలపాలి.
2, 3 నిమిషాలపాటు పెద్ద మంట మీద ఉంచి కలపాలి.
వెజ్‌ స్టాక్‌, ఉప్పు వేసి కలపాలి.
చిన్న మంట మీద ఉంచి సూప్‌ చిక్కబడేవరకూ కలుపుతూ ఉండాలి.
సూప్‌ చిక్కబడిన తర్వాత మిరియాల పొడి వేయాలి.
చివర్లో కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-07-22T23:09:12+05:30 IST