చికెన్‌ హలీమ్‌

ABN , First Publish Date - 2017-06-04T15:27:59+05:30 IST

కావలసిన పదార్థాలు బోన్‌లెస్‌ చికెన్‌ (అర అంగుళం పొడవు) - 200 గ్రా గోధుమ రవ్వ - 6 టే.స్పూన్లు యాలకులు - 6

చికెన్‌ హలీమ్‌

కావలసిన పదార్థాలు
 
బోన్‌లెస్‌ చికెన్‌ (అర అంగుళం పొడవు) - 200 గ్రా
గోధుమ రవ్వ - 6 టే.స్పూన్లు
యాలకులు - 6
లవంగాలు - 10
బిరియాని ఆకులు - 4
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
జీలకర్ర - 2 టీస్పూన్లు
ఉల్లి ముక్కలు - 2 కప్పులు
అల్లం పేస్ట్‌ - 2 టే.స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్‌ - 2 టే.స్పూన్లు
నానబెట్టిన పొట్టు మినప్పప్పు - 4 టే.స్పూన్లు
నానబెట్టిన శనగపప్పు - 4 టే.స్పూన్లు
డాలియా - 6 టే.స్పూన్లు
పసుపు - 1 టీస్పూన్లు
కారం - 2 టీస్పూన్లు
ఉప్పు - తగినంత
గరం మసాలా - 1 టీస్పూను
కొత్తిమీర - 4 కట్టలు
పుదీనా ఆకులు - 20
నెయ్యి - పావు కిలో

తయారీ విధానం

గిన్నెలో నెయ్యి వేసి కాగాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, బిరియాని ఆకులు, ఉల్లిపాయలు వేసి ఎర్రబడేవరకూ వేయించాలి.
తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లు వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించి శనగపప్పు, మినప్పప్పు, డాలియా వేసి వేయించాలి.
తర్వాత పసుపు, కారం వేసి కలపాలి.
3 నిమిషాల తర్వాత కప్పు నీళ్లు పోసి మరో 5 నిమిషాలపాటు ఉడికించాలి.
ఇప్పుడు చికెన్‌ ముక్కలు, ఉప్పు వేసి కలిపి తెర్లబెట్టాలి.
తర్వాత పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసి కలపాలి.
చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి.
మెత్తగా ఉడికి చికెన్‌ ముక్కలు బాగా కలిసేదాకా తిప్పాలి.
నెయ్యి పైకి తేలుతుండగా హలీమ్‌ పొయ్య నుంచి దింపి బిరియాని ఆకులు ఏరి తీసేయాలి.
హ్యాండ్‌ బ్లెండర్‌తో హలీమ్‌ను మెత్తగా మెదిపి నిమ్మ చెక్కలతో వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-06-04T15:27:59+05:30 IST