v id="pastingspan1">
10-11-2017: టమోటా రుచిని ఇష్టపడనివారు చాలా అరుదుగా ఉంటారు. టమోటాలను నీటిలో ఉడికించి, మెత్తగా గ్రైండ్ చేసి, రెడీగా ఉంచుకోండి. ఒక పాన్‌లో వెన్న కొద్దిగా కరిగించి, ఒక చిన్న పచ్చి మిర్చి, రెండు కరివేపాకు రెమ్మలు వేయాలి. ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. వెంటనే టమోటా గుజ్జు వేసి, కొంచెం నీళ్ళు పోసి మరగనివ్వాలి. అంతే... అంగారకుడి రంగులో మెరిసిపోతున్న టమోటా సూప్ రెడీ. టమోటాలు గుండె ఆరోగ్యానికి మంచివి!