Abn logo

ఫ్రాన్స్ సూప్‌

కావలసిన పదార్థాలు
రొయ్యలు - 50 గ్రా., మొలకెత్తిన పెసలు - ఒక కప్పు, సెలెరీ తరుగు - ఒక కప్పు, పుదీనా ఆకులు - 10, చిన్న టమోటా - ఒకటి, ఉల్లి తరుగు - అర కప్పు, బిర్యానీ ఆకులు - 2, మిరియాలు - 3, లవంగాలు - 2, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మిరియాల పొడి - ఒక టీ స్పూను చొప్పున, నూనె 2 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌ స్పూను. ఎండుమిర్చి తరుగు (ఇష్టమైతే) - ఒక టీ స్పూను, వెజిటెబుల్‌
స్టాక్‌ - 2 కప్పులు, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారుచేసే విధానం
ముందుగా పెసర మొలకల్ని మెత్తగా ఉడికించి, మెదిపి పక్కనుంచాలి. కొద్ది నూనెలో ఉల్లితరుగు, టమోటా ముక్కలు వేగించి, సెలెరీ తరుగు, పుదీనాతో పాటు మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పాన్‌లో నూనె వేసి శుభ్రం చేసిన రొయ్యలు వేసి 2 నిమిషాలు వేగించి మిరియాలు, ఎండుమిర్చి తరుగు చల్లాలి. ఇప్పుడు వెజిటెబుల్‌ స్టాక్‌, ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత టమోటా మిశ్రమం, మెదిపిన మొలకలు కలపాలి. కప్పు నీటిలో కరిగించిన కార్న్‌ ఫ్లోర్‌ కలిపి చిన్న మంటపై మరో 5 నిమిషాలు మరిగించి సూప్‌ చిక్కబడ్డాక బౌల్స్‌లో పోసి మిరియాల పొడి చల్లి పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

ప్రమాదవశాత్తు ఒకరి మృతిహార్వెస్టర్‌కు తగిలి వ్యవసాయ కూలీ మృతికొండాపూర్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతిఇరువురి మధ్య గొడవ..తోపులాటలో ఒకరి మృతిశ్మశాన వాటికలను త్వరగా పూర్తి చేయాలిపల్లెల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు అయ్యప్ప భక్తుడిపై దాడి అభివృద్ధికే గ్రేటర్‌ ప్రజల పట్టంగ్రేటర్‌ తీర్పు కొత్తమార్పు‘సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం’
Advertisement
Advertisement