మలాయి కి ఖీర్‌

ABN , First Publish Date - 2019-03-16T19:25:56+05:30 IST

బాస్మతి బియ్యం/సేమియా - ముప్పావు కప్పు, పాలు - రెండు లీటర్లు, కండెన్సెడ్‌ మిల్క్‌ - ఒకటిన్‌..

మలాయి కి ఖీర్‌

కావలసిన పదార్థాలు
 
బాస్మతి బియ్యం/సేమియా - ముప్పావు కప్పు, పాలు - రెండు లీటర్లు, కండెన్సెడ్‌ మిల్క్‌ - ఒకటిన్‌, కోవా - 50గ్రా., క్రీమ్‌ - అరకప్పు, పంచదార - 200గ్రా., యాలకుల పొడి - 1 టీ స్పూన్‌, కుంకుమపువ్వు - ఒక టీస్పూన్‌, బాదం - 50గ్రా., పిస్తా - 50గ్రా.
 
తయారీవిధానం
 
ఒకపాత్రలో బియ్యాన్ని నానబెట్టుకోవాలి. తరువాత గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్‌లో పాలు పోసి మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తరువాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని వేయాలి. బియ్యం పిండి ఉడుకుతున్న సమయంలో కండెన్సెడ్‌ మిల్క్‌, కోవా వేయాలి. మరో పదినిమిషాల పాటు ఉడికించి క్రీమ్‌, పంచదార, యాలకుల పొడి, కుంకుమపువ్వు, బాదం పలుకులు, పిస్తా వేస్తే మలాయి కి ఖీర్‌ రెడీ.
హోలీలో మలాయి కి ఖీర్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

Updated Date - 2019-03-16T19:25:56+05:30 IST