బచ్చలి పెరుగు పులుసు

ABN , First Publish Date - 2017-10-21T22:10:27+05:30 IST

బచ్చలి తరుగు - ఒక కప్పు, గిలకొట్టిన పెరుగు - ఒక కప్పు, శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, (ఇష్టమైతే) కారం...

బచ్చలి పెరుగు పులుసు

కావలసిన పదార్థాలు
బచ్చలి తరుగు - ఒక కప్పు, గిలకొట్టిన పెరుగు - ఒక కప్పు, శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, (ఇష్టమైతే) కారం - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు+ జీలకర్ర - ఒక స్పూను, పచ్చిమిర్చి - 2, ఎండు మిర్చి - 3.
 
తయారుచేసే విధానం
కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయాలి. అన్నీ వేగాక బచ్చలి తరుగు వేసి
మూత పెట్టాలి. ఆకు మగ్గిన తర్వాత పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేయాలి. మరుగుతున్నప్పుడు (కప్పు నీటిలో ఉండలు లేకుండా కలుపుకున్న)
శనగపిండిని వేసి బాగా కలపాలి. పులుసు చిక్కబడ్డాక దించేయాలి.

Updated Date - 2017-10-21T22:10:27+05:30 IST