మఖానా ఖీర్‌

ABN , First Publish Date - 2019-03-02T22:13:37+05:30 IST

పాలు - ఒక లీటరు, తామర గింజలు - పావు కప్పు, పంచదార - 2 టేబుల్‌స్పూన్‌లు పిస్తా

మఖానా ఖీర్‌

కావలసిన పదార్థాలు
పాలు - ఒక లీటరు, తామర గింజలు - పావు కప్పు, పంచదార - 2 టేబుల్‌స్పూన్‌లు
పిస్తా - 2 టీస్పూన్‌లు(ముక్కలు), బాదం - 2 టీస్పూన్‌లు (ముక్కలు), యాలకుల పొడి - 1 టీస్పూన్‌.
 
తయారుచేయు విధానం
ఒక పాత్రను తీసుకుని అందులో పాలు పోసి వేడి చేసుకోవాలి. తరువాత పాలలో తామరగింజలు వేసి గంటన్నర నుంచి రెండు గంటల పాటు చిన్న మంటపై ఉడికించుకోవాలి. గింజలు మెత్తగా అయిన తరువాత పంచదార కలుపుకుని మరికాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పిస్తా, బాదం, యాలకుల పొడి వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఖీర్‌ను చల్లగా తింటే ఆ మజాయే వేరు.

Updated Date - 2019-03-02T22:13:37+05:30 IST