కొత్తిమీర, పుదీనా పచ్చడి
v id="pastingspan1">
కావలసినవి
తాజా కొత్తిమీర-రెండు కప్పులు(సన్నటి తరుగు), తాజా పుదీనా ఆకులు-అరకప్పు, అల్లం- చిన్న ముక్క (పైన తొక్క తీసి సన్నగా తరిగి), మీడియం సైజు ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరిగి), వెల్లుల్లి రెబ్బలు- నాలుగు (సన్నగా తరిగి. ఇష్టపడితే), చిల్లీ పెప్పర్- పావు టీస్పూను, జీలకర్ర - ఒక టీస్పూను (ఇష్టపడితే), నిమ్మకాయ - ఒకటి (రసం తీసి), నీళ్లు- నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత.
తయారీవిధానం
పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ పచ్చడిని స్నాక్స్‌తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. జీర్ణక్రియ బాగుంటుంది.