బార్లీ రోటీ

ABN , First Publish Date - 2018-02-17T20:06:42+05:30 IST

బార్లీపిండి-వంద గ్రాములు, నీరు- వంద ఎంఎల్‌, చిల్లీ పేస్టు- అర టీస్పూను, కొత్తిమీర- అర కప్పు...

బార్లీ రోటీ

కావలసినవి
 
బార్లీపిండి-వంద గ్రాములు, నీరు- వంద ఎంఎల్‌, చిల్లీ పేస్టు- అర టీస్పూను, కొత్తిమీర- అర కప్పు (సన్నగా తరిగి), ఉప్పు- తగినంత.
 
తయారీవిధానం
 
గిన్నెలో సగానికి నీరు తీసుకుని సన్నని మంటపై వేడిచేయాలి. అందులో బార్లీ పిండి, చిల్లీ పేస్టు, కొత్తిమీర వే సి మూడు నిమిషాలు అలానే ఉంచాలి. ఆ మిశ్రమాన్ని కలపొద్దు. తర్వాత దించి, చెక్క కర్రతో పిండిని కలియబె ట్టాలి. ఇలా చేస్తే పిండి ఉండ కట్టదు. బాగా కలిపిన తర్వాత ఐదు నిమిషాలపాటు చల్లారనిచ్చి దాన్ని వెడల్పాటి ప్లేటులోకి మార్చాలి. దాన్ని మెత్తటి పిండిలా చేయాలి. ఆ తర్వాత చిన్న ఉండలు చేసి రోటీల్లా ఒత్తాలి.
పెనం మీద ఒక్కొక్క రోటీని పావు టీస్పూను నెయ్యి వేసి కాల్చాలి. వీటిని వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-02-17T20:06:42+05:30 IST