అటుకుల పాయసం

ABN , First Publish Date - 2018-09-01T19:28:31+05:30 IST

నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపపప్పులు - ఎనిమిది (పైన చల్లడానికి పలుకులుగా చేసి), ఎండుద్రాక్ష...

అటుకుల పాయసం

కావలసినవి
 
నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపపప్పులు - ఎనిమిది (పైన చల్లడానికి పలుకులుగా చేసి), ఎండుద్రాక్ష - ఒక టీస్పూను, లావు (దొడ్డు) అటుకులు - అరకప్పు, పాలు - రెండుంపావు కప్పులు, ఆర్గానిక్‌ చక్కెర లేదా బెల్లం తరుగు - అర కప్పు, నీళ్లు - మూడు టేబుల్‌స్పూన్లు (బెల్లం/చక్కెర కరిగించడానికి), యాలకులు-నాలుగు (పొడి చేసి), పాయసం చిక్కగా ఉండడానికి- అటుకుల రెండు టేబుల్‌ స్పూన్లు, (దానికి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు.) బియ్యప్పిండి అయితే- ఒకటిన్నర టీస్పూను, జీడిపప్పులు-ఎనిమిది.
 
తయారీవిధానం
 
చిన్న కుండలో బెల్లం తరుగుతోపాటు మూడు టేబుల్‌స్పూన్ల నీళ్లు పోయాలి. దీన్ని సన్నని మంటపై పెట్టి కరగబెట్టాలి. అది ఉడికి బుడగలు వస్తుంటే స్టవ్‌ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. జీడిపప్పులు, రెండు టేబుల్‌స్పూన్ల అటుకులను బ్లెండర్‌లో వేసి మెత్తటి పొడిలా చేయాలి. ఒకవేళ బియ్యప్పిండి వాడుతుంటే అటుకుల పొడి చేయనక్కర లేదు.
పాన్‌లో నెయ్యి వేడిచేసి జీడిపప్పులు బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. అందులో ఎండుద్రాక్ష కూడా వేసి వేగించాలి. అదే పాన్‌లో లావు అటుకులు వేసి సన్నని మంటపై వేగించాలి. అటుకులు సువాసనలు వెదజల్లడం ప్రారంభం కాగానే అందులో పోహా పౌడర్‌ లేదా బియ్యప్పిండి (ఏదో ఒకటే) కలిపి రెండు నిమిషాలు పాన్‌లో వేగించాలి. అందులో పాలుపోసి సన్ననిమంటపై అటుకులు మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇది ఉడికే సమయంలో పాన్‌కు అతుక్కుపోకుండా గరిటెతో కలుపుతుండాలి. అటుకుల ఖీర్‌ చిక్కబడే లోపల బెల్లం సిరప్‌ కూడా చ ల్లారుతుంది. అందులో యాలకుల పొడి వేయాలి. వరిపిండి వాడుతుంటే మటుకు పావుకప్పు నీళ్లల్లో బియ్యప్పిండి వేసి చిక్కగా చేసి ఖీర్‌ కుండలో కలిపి సన్నని మంటపై దగ్గరపడేదాకా ఉడికించాలి. పాయసంలోకి బెల్లం పాకం పోసి కిందకు దించాలి. అటుకుల ఖీర్‌పై నేతిలో వేగించిన జీడిపప్పు పలుకులు, నెయ్యి వేయాలి. చల్లారిన తర్వాత తింటే ఈ అటుకుల పాయసం బాగుంటుంది.

Updated Date - 2018-09-01T19:28:31+05:30 IST