ఫిష్‌ కట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2019-11-30T17:14:52+05:30 IST

మాగా చేపలు(ఇండియన్‌ సాల్మన్‌) - అరకిలో, అల్లం ముక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు - మూడు

ఫిష్‌ కట్‌లెట్స్‌

కావలసినవి: మాగా చేపలు(ఇండియన్‌ సాల్మన్‌) - అరకిలో, అల్లం ముక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు - మూడు, బ్రెడ్‌ ముక్కలు - 100గ్రా., కోడిగుడ్డు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పుదీనా - ఒకకట్ట, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, సోంపు - ఒక టీస్పూన్‌, మిరియాలు - నాలుగైదు, నూనె - సరిపడా, నిమ్మరసం - అర టీస్పూన్‌, బంగాళదుంప - ఒకటి, పిండి - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ఒక పాత్రలో నీళ్లు పోసి, నీళ్లు మరుగుతున్న సమయంలో అల్లం, వెల్లుల్లి వేసి, ఆ ఆవిరిపై చేప ముక్కలను మూత పెట్టి ఉడికించాలి. బ్రెడ్‌ ముక్కలు, కోడిగుడ్డు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, పుదీనా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బ్లెండర్‌లో బాగా కలపాలి. మిరియాలు, సోంపు బాగా దంచి పై మిశ్రమంలో కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, ఆవిరిపై ఉడికించిన చేప ముక్కలు వేసి మరొక్కసారి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపను వేసి కలియబెట్టాలి. ఇప్పుడు కట్‌లెట్‌ల మాదిరిగా చేసుకుంటూ పిండి అద్దాలి. తరువాత పది నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్లు వేసి వేగించాలి. పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-30T17:14:52+05:30 IST