మధుర పేడా

ABN , First Publish Date - 2018-09-01T19:27:24+05:30 IST

కోవా - 200 గ్రాములు, చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి - ఒక టీస్పూను..

మధుర పేడా

కావలసినవి
 
కోవా - 200 గ్రాములు, చక్కెర - మూడు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి - ఒక టీస్పూను, నెయ్యి - ఒక టేబుల్‌స్పూను, పాలు - మూడు టేబుల్‌స్పూన్లు, చక్కెరపొడి - పావు కప్పు.
 
తయారీవిధానం
 
వేడెక్కిన పాన్‌లో కోవా వేయాలి. నెయ్యి, చక్కెర అందులో వేయాలి. అందులో చక్కెర బాగా కలిసిపోయేంత దాకా గరిటెతో కలపాలి. తర్వాత అందులో పాలు పోసి గరిటెతో కలియబెట్టాలి. కోవా బంగారువర్ణంలోకి వచ్చి బాగా దగ్గర పడాలి. అందులో యాలకుల పొడి వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ఒక పళ్లెంలో పోయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత కోవాను ఉండల్లా చేయాలి. ఈ పేడాల మధ్య భాగంలో చిన్న చిల్లు పెట్టాలి.
పేడాలపై చక్కెర పొడిని అద్దితే మధుర పేడాలు రెడీ.

Updated Date - 2018-09-01T19:27:24+05:30 IST