Abn logo

ఉసిరి పెరుగు చారు

కావలసిన పదార్థాలు
 
పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - రుచికోసం, ఉసిరికాయల తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, పచ్చికొబ్బరి కోరు - పావు కప్పు, నెయ్యి - ఒక టీ స్పూను, ఇంగువ - అర టీ స్పూను, మినప్పప్పు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, ఎండు మిర్చి - ఒకటి, కరివేపాకు - 4 రెబ్బలు.
 
తయారుచేసే విధానం
 
ఉసిరికాయల తరుగు, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి కోరు కలిపి 2 టేబుల్‌ స్పూన్ల నీటితో పేస్టు చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, ఉప్పు, ఉసిరి పేస్టు వేసి తగినంత నీరు కలిపి బాగా చిలకాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకుతో తాలింపు వేసి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చారు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

అంతుపట్టని వ్యూహంగందరగోళంగా వ్యవ‘సాయం’‘ఆదివాసీ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి’పెన్‌గంగా ప్రాజెక్టు రైతులకు వరం లాంటిది : ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనఅభివృద్ధికి పునరంకితం కావాలితొలకరికే.. తొందర వద్దునేడే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలువిద్యార్థులు హాజరయ్యేలా చూడాలి‘పల్లె ప్రగతి’తో గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే రేఖ
Advertisement
d_article_rhs_ad_1
Advertisement