పాలకోవా

ABN , First Publish Date - 2019-08-24T18:11:24+05:30 IST

మీగడ తీయని పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకులపొడి - చిటికెడు.

పాలకోవా

కావలసినవి
 
మీగడ తీయని పాలు - ఒకటిన్నర లీటరు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకులపొడి - చిటికెడు.
 
తయారీవిధానం
 
ఒక మందపాటి పాన్‌ తీసుకొని పాలు పోసి చిన్నమంటపై మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మరుగుతున్న సమయంలోనే కుంకుమపువ్వు వేయాలి. పాలు మరిగి చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతాయి. పాలు కాస్త చిక్కబడిన తరువాత యాలకులపొడి, పంచదార, నెయ్యి వేసి కలియబెట్టాలి. పంచదార వేసిన తరువాత మిశ్రమం కాస్త పలుచబడుతుంది. మరికాసేపు చిన్నమంటపై ఉంచితే చిక్కటి మిశ్రమంగా మారుతుంది. ఇప్పుడు స్టవ్‌ ఆపేసి మరో పాత్రలోకి మార్చుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-08-24T18:11:24+05:30 IST