అటుకుల పాయసం

ABN , First Publish Date - 2019-08-24T17:26:37+05:30 IST

అటుకులు - ఒకకప్పు, పాలు - రెండున్నర కప్పులు, బెల్లం - అరకప్పు, జీడిపప్పు - నాలుగు పలుకులు, కొబ్బరి పొడి - రెండు టీస్పూన్లు, యాలకులపొడి - అర టీస్పూన్‌, నెయ్యి - రెండు టీస్పూన్లు...

అటుకుల పాయసం

కావలసినవి
 
అటుకులు - ఒకకప్పు, పాలు - రెండున్నర కప్పులు, బెల్లం - అరకప్పు, జీడిపప్పు - నాలుగు పలుకులు, కొబ్బరి పొడి - రెండు టీస్పూన్లు, యాలకులపొడి - అర టీస్పూన్‌, నెయ్యి - రెండు టీస్పూన్లు.
 
తయారీవిధానం
 
అటుకులను నీళ్లలో వేసి, ఓ నిమిషం తరువాత నీళ్లు తీసేయాలి. నీళ్లు ఇంకా ఉన్నట్లయితే అటుకులను పిండి నీళ్లు తీసేయాలి. ఒకపాత్రలో కొద్దిగా నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక జీడిపప్పు వేసి వేగించాలి. కొబ్బరి పొడి కూడా వేసి వేగించాలి. తరువాత పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తరువాత అటుకులు వేయాలి. చివరగా యాలకుల పొడి వేసి దింపుకోవాలి. వేడి వేడిగా తింటే అటుకుల పాయసం రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-08-24T17:26:37+05:30 IST