సెవెన్‌కప్‌ బర్ఫీ

ABN , First Publish Date - 2018-11-10T18:23:49+05:30 IST

కొబ్బరికోరు-ఒక కప్పు, పంచదార- మూడు కప్పులు, సెనగపిండి- ఒక కప్పు, నెయ్యి- ఒక కప్పు...

సెవెన్‌కప్‌ బర్ఫీ

కావలసినవి
 
కొబ్బరికోరు-ఒక కప్పు, పంచదార- మూడు కప్పులు, సెనగపిండి- ఒక కప్పు, నెయ్యి- ఒక కప్పు, పాలు- ఒక కప్పు, జీడిపప్పు, యాలకులపొడి-సరిపడా.
 
తయారీవిధానం
 
ఒక స్టీలు ప్లేటు తీసుకుని దానికి నెయ్యి రాయాలి. పాన్‌లో ఒక కప్పు నెయ్యి వేసి సన్నని సెగపై వేడిచేయాలి. అందులో సెనగపిండి వేసి ఉండకట్టకుండా గరిటెతో కలుపుతుండాలి. ఒక నిమిషం సన్నని సెగపై ఉడికించడం వల్ల సెనగపిండిలోని పచ్చివాసన పోతుంది. అందులో తురిమిన కొబ్బరి వేసి కలపాలి. తర్వాత చక్కెర కొద్ది కొద్దిగా వే స్తూ కలపాలి. సన్నని సెగపై దీన్ని ఉడికించాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత అందులో పాలు పోయాలి. ఇలా చేయడం వల్ల చక్కెర ఇందులో బాగా కలుస్తుంది. అప్పుడే యాలకుల పొడి కూడా ఇందులో వేసి ఆపకుండా ఈ మిశ్రమాన్ని కలుపుతుండాలి. మిశ్రమం బాగా దగ్గరపడిన తర్వాత నెయ్యి రాసిన ప్లేటుపై జీడిపప్పు, డ్రైఫ్రూట్‌ ముక్కలు చల్లి సెనగపిండి, చక్కెర మిశ్రమం పాకాన్ని దానిపై పోసి 20 నిమిషాలు చల్లారనివ్వాలి. మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్‌ చేయాలి. తర్వాత వేరే ప్లేటును దీని మీద పెట్టి దాన్ని మొత్తం తిరగవేస్తే కట్‌ చేసిన బర్ఫీ ముక్కలు జీడిపప్పు, డ్రైఫ్రూట్‌ ముక్కలతో సహా రెండో ప్లేటులోకి మారతాయి. కార్తికమాసం స్పెషల్‌ ఆ సెవెన్‌ కప్‌ బర్ఫీ.

Updated Date - 2018-11-10T18:23:49+05:30 IST