కాజూ కత్లీ

ABN , First Publish Date - 2018-11-03T18:47:08+05:30 IST

కుంకుమపువ్వు - ఒక టీస్పూను, జీడిపప్పు - వంద గ్రాములు (చిన్న పలుకులుగా చేసి), చక్కెర...

కాజూ కత్లీ

కావలసిన పదార్థాలు
 
కుంకుమపువ్వు - ఒక టీస్పూను, జీడిపప్పు - వంద గ్రాములు (చిన్న పలుకులుగా చేసి), చక్కెర - ఆరు టేబుల్‌స్పూన్లు, గ్రీన్‌ యాలకుల పొడి - అర టీస్పూను, సిల్వర్‌ఫాయిల్‌ - రెండు షీట్లు.
 
తయారీవిధానం
 
జీడిపప్పు పలుకులను మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి. నాన్‌స్టిక్‌ పాన్‌లో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. అందులో చక్కెర, కుంకుమపువ్వు వేసి చిక్కటి పాకం కానివ్వాలి.
అందులో యాలకుల పొడి వేసి కలపాలి. తర్వాత జీడిపప్పు పొడి అందులో వేయాలి.
మూడు నిమిషాలు సన్నని సెగపై ఉడకనిచ్చి పళ్లెంలో పోసి కాస్త చల్లారనివ్వాలి.
ఆ మిశ్రమాన్ని బర్ఫీ ట్రేలోకి మార్చి సిల్వర్‌ఫాయిల్‌తో గార్నిష్‌ చేయాలి. కాసేపైన తర్వాత దాన్ని ముక్కలుగా కట్‌ చేయాలి. పూర్తిగా కాజూతో తయారైన ఈ కాజూ కత్లీని పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా ఇష్టంగా తింటారు.

Updated Date - 2018-11-03T18:47:08+05:30 IST