జిలేబీ

ABN , First Publish Date - 2018-11-03T18:43:14+05:30 IST

మైదా - మూడు కప్పులు, గడ్డపెరుగు - రెండు కప్పులు, నెయ్యి - అరకప్పు, చక్కెర - మూడు కప్పులు

జిలేబీ

కావలసినవి
 
మైదా - మూడు కప్పులు, గడ్డపెరుగు - రెండు కప్పులు, నెయ్యి - అరకప్పు, చక్కెర - మూడు కప్పులు, కుంకుమపువ్వు - కొద్దిగా, గ్రీన్‌ యాలకుల పొడి - అర టీస్పూను, మొక్కజొన్నపిండి - అరకప్పు, వంటసోడా - చిటికెడు, నూనె - రెండు కప్పులు, నీళ్లు - మూడు కప్పులు, రోజ్‌ ఎసెన్స్‌ - నాలుగు చుక్కలు, ఎడిబుల్‌ ఫుడ్‌ కలర్‌- అర టీస్పూను.
 
తయారీవిధానం
ఒక పాత్రలో మైదా, మొక్కజొన్న పిండి, వంటసోడా వేసి బాగా కలపాలి. అందులో నెయ్యి, ఆరంజ్‌ ఫుడ్‌ పౌడర్‌ వేసి కలపాలి. పెరుగు, నీళ్లు ఇందులో కలిపి చిక్కటి పిండిలా తయారుచేసుకోవాలి. ఈ పిండిని పది గంటలపాటు అలాగే పులవనివ్వాలి.
పాన్‌లో నీళ్లు పోసి సన్నని మంటపై మరిగించాలి. మరుగుతున్న నీళ్లల్లో పంచదార వేసి తీగపాకం వచ్చేదాకా ఉడికించాలి. అందులో కుంకుమపువ్వు, రోజ్‌ ఎసెన్స్‌, లకులపొడి వేసి కలపాలి. తర్వాత పాన్‌లో వేగించడానికి సరిపడా నూనె పోసి బాగా వేడిచేయాలి.
మస్లిన్‌ క్లాత్‌ తీసుకుని దానికి చిన్న చిల్లు పెట్టాలి. రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ క్లాత్‌లో పోసి రింగులుగా వేడి నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకూ క్రిస్పీగా ఉండేలా వేగించాలి. ఆ జిలేబీలను సమమైన వేడిలో ఉన్న పంచదార పాకంలో వేసి మూడు నిమిషాలు నాననిచ్చి తర్వాత తీసేయాలి. పాకం నుంచి నానిన జిలేబీని బయటకు తీసి బటర్‌ పేపర్‌ లేదా ఫాయిల్‌ ఉన్న ట్రేలో పెట్టాలి. వీటిని వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-11-03T18:43:14+05:30 IST