గుమ్మడికాయ సూప్‌

ABN , First Publish Date - 2019-11-23T14:36:05+05:30 IST

గుమ్మడికాయ - సగం ముక్క, తేనె - ఒక టీస్పూన్‌, క్రీమ్‌ - ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు,

గుమ్మడికాయ సూప్‌

కావలసినవి : గుమ్మడికాయ - సగం ముక్క, తేనె - ఒక టీస్పూన్‌, క్రీమ్‌ - ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, చికెన్‌ స్టాక్‌ - రెండు లీటర్లు, నూనె - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - రెండు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ముందుగా ఓవెన్‌ను 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకు వేడి చేయాలి. గుమ్మడికాయ ముక్క తీసుకొని విత్తనాలు తీసేయాలి. కొద్దిగా నూనె, ఉప్పు మిరియాల పొడి చల్లాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు దంచి అందులో వేయాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను ఓవెన్‌లో పెట్టి రోస్ట్‌ చేసుకోవాలి. కాసేపయ్యాక బయటకు తీసి చల్లారిన తరువాత ఒక కప్పు చికెన్‌ స్టాక్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా గ్రైండ్‌ చేయాలి. తర్వాత పాన్‌ తీసుకొని కొద్దిగా నూనె వేసి మిగతా చికెన్‌ స్టాక్‌, తేనె, క్రీమ్‌ వేసి వేగించాలి. ఎండుమిర్చి, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మసాలా రెడీ చేసుకోవాలి. గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని కప్పులో పోసి మసాలాతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. గుమ్మడికాయ సూప్‌లో పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యపరంగా బెస్ట్‌ సూప్‌.

Updated Date - 2019-11-23T14:36:05+05:30 IST