దోసకాయ సూప్‌

కావలసినవి : దోసకాయలు - రెండు, పెరుగు - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, చికెన్‌ స్టాక్‌ - రెండు కప్పులు, బ్రెడ్‌ ముక్కలు - రెండు, నూనె - కొద్దిగా, ఛీజ్‌ - కొంచెం.
 
తయారీ విధానం: ముందుగా దోసకాయల పొట్టు తీసి, చిన్నగా కట్‌ చేసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. అందులో చికెన్‌స్టాక్‌, పెరుగు, పుదీనా ఆకులు, వెల్లుల్లిరెబ్బలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లబడే వరకు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత బ్రె డ్‌ని ముక్కలుగా కట్‌ చేయాలి. పాన్‌పై కొద్దిగా వేగించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ ముక్కలపై ఛీజ్‌ రాయాలి. చల్లబడిన సూప్‌ను బౌల్‌లోకి తీసుకుని అందులో పుదీనా ఆకులు, బ్రెడ్‌ ముక్కలు వేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. దోసకాయ సూప్‌లో పెరుగు కలిసి ఉండటం వల్ల కాస్త పుల్ల పుల్లగా బాగుంటుంది.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement