బేబీ కార్న్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-11-23T14:32:39+05:30 IST

బేబీ కార్న్‌ - ఒక కప్పు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, క్యాబేజీ తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, క్యాప్సికం ముక్కలు

బేబీ కార్న్‌ సూప్‌

కావలసినవి : బేబీ కార్న్‌ - ఒక కప్పు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పచ్చిమిర్చి - ఒకటి, కొత్తిమీర - కొద్దిగా, క్యాబేజీ తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, క్యాప్సికం ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు, పుట్టగొడుగులు(చిన్నగా కట్‌ చేసినవి) - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు - ఒక టీస్పూన్‌, సోయా సాస్‌ - ఒక టీస్పూన్‌, మొక్కజొన్నపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా.
 
తయారీ విధానం: కార్న్‌, క్యాప్సికం, పుట్టగొడుగులను శుభ్రంగా కడగాలి. పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. కార్న్‌, క్యాప్సికం ముక్కలు, పుట్టగొడుగులు, మిరియాలు, కొత్తిమీర వేసి మరికాసేపు వేగించాలి. తర్వాత సోయాసాస్‌ వేసి కొద్దిగా నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో మంటను తగ్గించి మొక్కజొన్న పిండి కలపాలి. దాంతో చిక్కగా సూప్‌లాగా తయారవుతుంది. చివరగా క్యాబేజీ తురుము వేసి మంట తగ్గించి దింపాలి. ఈ సూప్‌ను వేడి వేడిగా సర్వ్‌ చేసుకుంటే రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-11-23T14:32:39+05:30 IST