రాగి హల్వా

ABN , First Publish Date - 2019-06-22T17:59:35+05:30 IST

రాగి పిండి - ఒకకప్పు, పాలు - రెండున్నర కప్పులు, బెల్లం - అరకప్పు, యాలకుల పొడి

రాగి హల్వా

ఇకావలసినవి
 
రాగి పిండి - ఒకకప్పు, పాలు - రెండున్నర కప్పులు, బెల్లం - అరకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, జీడిపప్పు - పది పలుకులు.
 
తయారీవిధానం
 
ఒకపాత్రలో బెల్లం, కొన్ని నీళ్లు పోసి బెల్లం కరిగే వరకు చిన్న మంటపై ఉంచి దింపాలి.
మరొక పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించాలి. నెయ్యిలో రాగి పిండి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి. ఇప్పుడు పిండిలో పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. యాలకుల పొడి వేయాలి.
పిండి గట్టిగా ఉంటే ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసుకోవచ్చు. కాసేపు ఉడికిన తరువాత బెల్లం పానకం వేయాలి. మరో పదినిమిషాల పాటు ఉంచి దింపుకోవాలి. అంతే... వేడి వేడి రాగి హల్వా రెడీ.

Updated Date - 2019-06-22T17:59:35+05:30 IST