Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొబ్బరి ఆవకాయ

కావలసినవి
 
మామిడికాయ ముక్కలు - ఒకకేజీ, ఉప్పు - 250 గ్రాములు, పసుపు - ఒక టేబుల్‌స్పూన్‌, కారం పొడి - 125 గ్రాములు, ఎండు కొబ్బరి పొడి - 250 గ్రాములు, ఆవపొడి - 50 గ్రాములు, జీలకర్ర పొడి - 25 గ్రాములు, మెంతిపొడి - ఒక టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి ముద్ద - 250 గ్రాములు, నువ్వుల నూనె - 300 గ్రాములు, ఇంగువ - చిటికెడు, జీలకర్ర, మెంతులు - ఒక టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
మామిడికాయ ముక్కలు తగినంత సైజులో కట్‌ చేసి, లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి, ఆవపొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి. నూనె చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవడానికి తీసుకోవచ్చు.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement