Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉడికిన తొక్కు/ఆవకాయ

కావలసినవి
 
మామిడికాయ గుజ్జు - కేజీ, ఉప్పు - 250 గ్రాములు, పసుపు - టేబుల్‌స్పూన్‌, కారం పొడి - 125 గ్రాములు, అల్లం వెల్లుల్లి ముద్ద - 250 గ్రాములు, నువ్వుల నూనె - 250 గ్రాములు, జీలకర్ర పొడి - 25 గ్రాములు, మెంతిపొడి - టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఆవాలు, జీలకర్ర, మెంతులు - ఒకటిన్నర టీస్పూన్‌.
 
తయారీవిధానం
మంచి కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత పైన చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జంతా తీసి పెట్టుకోవాలి. ఈ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం, మామిడి గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి. దీన్ని శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత మరోసారి కలిపి తినడానికి తీసుకోవచ్చు. ఈ ఆవకాయని చట్నీలా ఇడ్లీ, దోశ, ఉప్మాలోకి, అన్నంలోకి వాడుకోవచ్చు.

కుంరం భీం జిల్లాలో బాండ్‌ పేపర్ల కొరత పేదలకు ఆర్థిక చేయూతనందించేందుకే దళిత బంధునిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలికంకర లోడ్‌ లారీలను నడపవద్దని ఆందోళనబాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలికాగజ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా శతచండీయాగంపట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలిరెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన మార్స్క్‌ భవన్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు కొవిడ్‌ లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలి
Advertisement